శ్యామలాదేవికి నేనే సాయం చేశా : మల్లారెడ్డి

by Shyam |
శ్యామలాదేవికి నేనే సాయం చేశా : మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడిపై భూకబ్జా ఆరోపణలు చేసిన ఓ మహిళ… పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు సహా ఐదుగురుపై కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని ఖండించారు. తనకు ఎవరి భూములు కబ్జా చేయాల్సిన అవసరం లేదని, తనకే చాలా భూములు ఉన్నాయని అని అన్నారు. అంతేగాకుండా భూ వివాదంలో శ్యామలాదేవికి తానే సాయం చేశానని వెల్లడించారు. శ్యామలాదేవికి భూమి కొలిపించి ఇచ్చే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణ జరుపకుండా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. దీంతో పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా అని అన్నారు.

Advertisement

Next Story