ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట.. మంత్రి మల్లారెడ్డి

by Shyam |   ( Updated:2021-12-13 06:38:42.0  )
malla reddy
X

దిశ, శామీర్ పేట్: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మూడు చింతలపల్లి మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారం తో పాటు పల్లె ప్రగతికి కృషి చేస్తున్నారని తెలిపారు. పల్లెలను దేశానికి పట్టుకొమ్మలు గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నారన్నారు. మండలంలోని జగ్గం గూడలో సీసీ రోడ్డు, కొల్తుర్‌లో సీసీ రోడ్డు, అనంతారం లో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, నారాయణ పూర్‌లో సీసీ రోడ్డు, పోతారం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఉద్దెమర్రి లో సీసీ రోడ్డు, అద్రాస్ పల్లి లో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొత్తం రూ.80 లక్షలతో భూమి పూజ చేయడం జరిగిందన్నారు. అద్రాస్ పల్లి లో ముదిరాజ్ భవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ముందుగా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళి గౌడ్, ఎంపీడీవో పద్మావతి, తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed