రేవంత్ రెడ్డికి హెచ్చరిక.. మళ్లీ సవాల్ విసిరిన మల్లారెడ్డి

by Anukaran |
Minister Mallareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి చిల్లర దందాలు మానుకోవాలని మంత్రి మల్లారెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ బ్లాక్‌ మెయిలింగ్‌ను త్వరలోనే బయటపెడుతానన్నారు. తప్పుడు విమర్శలు చేస్తే తోలు తీస్తానంటూ హెచ్చరించారు. దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్లు దక్కించుకోవాలని మల్లారెడ్డి మరో చాలెంజ్ చేశారు.

నకిలీ కాగితాలతో ఆధారాలున్నాయని నమ్మించేందుకు రేవంత్ ప్రయత్నించారని మంత్రి విమర్శలు చేశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో కాగితాలు తెచ్చి చూపించారని సెటైర్లు వేశారు. శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ డీడ్‌తో ఉన్న 16 ఎకరాలు తన యూనివర్సిటీ కాంపౌండ్‌లోనే లేవని.. ఎంతో కష్టపడి ఆస్తులను కూడబెట్టానని మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లానని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంకోసారి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రి మల్లారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story