సర్పంచ్‌కి ఇస్తే సరిపోయిందా.. నా వాటా ఏది : మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

by Shyam |   ( Updated:2021-04-06 02:53:53.0  )
సర్పంచ్‌కి ఇస్తే సరిపోయిందా.. నా వాటా ఏది : మంత్రి మల్లారెడ్డి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పడింది. దాంట్లో వాటా ఇవ్వాల్సిందే అంటూ మంత్రి మాట్లాడినట్టు ఆడియో టేపు మీడియాలో వైరల్‌గా మారింది. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపాల్సిందే అంటూ మంత్రి హుకూం జారీ చేసినట్టు ఆడియోలో వినిపిస్తోంది. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేయడం గమనార్హం. ‘కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి’ అంటూ ఆడియోలో హుకుం జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మల్లారెడ్డి రియాక్షన్ ఇదే… క్లిక్ చేయండి

Advertisement

Next Story