- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌లో లోడ్ ఎక్కువైంది.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో లోడ్ ఎక్కువైందని, త్వరలోనే అందరికీ పదవులు వస్తాయని, ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో జరుగబోయే ‘టీఆర్ఎస్ విజయగర్జన మహాసభ’ను విజయవంతం చేయాలని బుధవారం శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో 75 లక్షల సభ్యత్వం ఉన్నట్లు తెలిపారు. పార్టీకోసం కష్టపడే కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్పగా టీఆర్ఎస్ పాలిస్తోందన్నారు. 75 ఏళ్లలో ఏ పార్టీ చేయలేని అభివృద్ధిని కేవలం ఏడేళ్లలోనే చేసి చూపించామని తెలిపారు. వరంగల్ సభకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, పార్టీ కార్యదర్శి జహంగీర్, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్ రెడ్డి, డీసీఎంఎస్ మధుకర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు.