రైతులపై అమ్మవారి దయ ఉండాలి : మంత్రి కన్నబాబు

by srinivas |
kannababu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గాలని..మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం దుర్గమ్మను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గాయత్రి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రైతాంగంపై అమ్మవారి దయ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయని..సిబ్బంది ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారని అయితే వచ్చే ప్రతీ భక్తుడు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. తొలిసారిగా 70 కోట్ల రూపాయలు దుర్గమ్మ గుడి అభివృద్ధికి కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. దుర్గగుడి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story