- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ లేఖ.. ఏమన్నారంటే !
దిశ, న్యూస్‌బ్యూరో: ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పురపాలక శాఖ ప్రారంభించిన ‘ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’లో అందరూ పాల్గొనాలని లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉందని, ప్రజా ప్రతినిధులు స్వయంగా భాగస్వాములవుతూ, ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు రాకుండా చూద్దామని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందని, వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం పోరాడుతుందని తెలిపారు. ప్రజారోగ్యం, వ్యక్తిగత శుభ్రత వంటి కీలకమైన అంశాల్లో కొంత సానుకూల మార్పు వచ్చిందని, భవిష్యత్తులోనూ ఈ అలవాట్లను, ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ అరోగ్యవంతమైన జీవితాలను గడిపేందుకు ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు.
వారానికోసారి కనీసం పది నిముషాల పాటైనా మనకోసం, మన పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించుకోవాలని, ఇప్పటికే ప్రత్యేక క్యాలండర్‌ను తయారు చేసి పారిశుధ్యం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రత్యేక కార్యచరణ ద్వారా పురపాలక శాఖ తరపున చేపట్టాల్సిన దోమల నివారణ, పారిశుధ్య కార్యక్రమాలపైన పలు సూచనలిచ్చామమని, యాంటీ మస్కిటో కార్యక్రమాల్లో భాగంగా మలాథియాన్ స్ప్రే, అయిల్ బాల్స్, ఫాగింగ్ వినియోగం చేయాలని సూచించామన్నారు. ప్రజలను, పట్టణాలను కాపాడుకునే కార్యక్రమంతో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గత వారం “ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు” కార్యక్రమాన్ని ప్రారంభించామని, పౌరులందరూ పాల్గొనేలా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. ప్రజా ప్రతినిధులందరూ తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజాఆరోగ్యం పైన చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రజలను సమాయత్తం చేస్తూ, పరిసరాల పరిశుభ్రత ఓ సామాజిక కార్యక్రమంగా ప్రజలు భావించే విధంగా ప్రచారం కల్పించాలని లేఖలో కోరారు.