- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనం తీసుకుంటారు.. ధాన్యం మాత్రం తీసుకోరా: మంత్రి కేటీఆర్
దిశ, సిరిసిల్ల: తెలంగాణ ధనం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ధాన్యం మాత్రం తీసుకోరా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం నుంచి గత ఏడున్నరేళ్లలో వ్యవసాయ రంగానికి సంబంధించి పైసా సాయం కూడా రాలేదన్నారు. బుధవారం ఆయన సిరిసిల్ల జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతల మాటలు విని రైతులు మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే ప్రకటన అనుసరించి నడుచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నప్పటికీ.. తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేస్తున్నట్లు ఎఫ్‌సీఐ చెప్పిందని కేటీఆర్గుర్తు చేశారు.
జాతి నిర్మాణంలో తెలంగాణ సంపద ఉందని రిజర్వ్ బ్యాంకు సహా ప్రతిష్టాత్మక సంస్థలు స్పష్టం చేశాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ధనం తీసుకునే కేంద్రం ధాన్యం తీసుకోదా అంటూ ప్రశ్నించారు. స్థానిక బీజేపీ నాయకులు చెప్పినట్లు వరి కొనుగోలుకు కేంద్రం సుముఖంగా ఉంటే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో రైతులకు క్షమాపణ చెప్పించాలన్నారు.
తెలంగాణ రైతుల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా యాసంగిలో పంటను కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నామన్నారు. యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ఇందిరాపార్క్వద్ద ప్రభుత్వం తరఫున చేస్తున్న మహాధర్నాకు మద్దతు తెలపాలని జిల్లా రైతులు, నాయకులను కేటీఆర్ కోరారు.