- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. చేనేత పరిశ్రమను ఆదుకోవాలని, చేనేత ఉత్పత్తులపై రెండేళ్ల పాటు జీఎస్టీ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ గణన చేపట్టి జియో ట్యాగింగ్ చేయాలని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు నిధులు కేటాయించాలని కోరారు. మౌలిక వసతుల కల్పనకు రూ.300 కోట్లు ఇవ్వాలన్న కేటీఆర్.. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరారు. రూ.993.65కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికోసం రూ.49.84కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కేటాయించాలని, ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు పోచంపల్లిలో భూమి, భవనం సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
Next Story