- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేటీఆర్ జన్మదినం రాష్ట్ర ప్రజలకు పండుగరోజు’
దిశ, సూర్యాపేట: మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో మంత్రి కెటీఆర్ జన్మదినం సందర్భంగా లలితాదేవి మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గత ఏడేండ్ల కాలంలో 50 వేల కంపెనీలు ఏర్పాటు చేయడంలో 15 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని ఆమె అన్నారు.
యువనేత, తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ జన్మదినం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్‌లు ముప్పారపు నాగేశ్వరరావు, దాచెపల్లి భరత్, సల్మా మస్తాన్, శంకర్, టీఆర్ఎస్ నాయకులు వైవి, ఉప్పల ఆనంద్, బైరు వెంకన్న, అనంతుల దుర్గా ప్రసాద్, ధరావత్ వెంకన్న నాయక్, కరుణశ్రీ, తండు రేణుక తదితరులు పాల్గొన్నారు.