తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.2100 కోట్లతో ట్రైటాన్ ఈవీ ఆసక్తి!

by Shyam |
KTR twitter
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో గల నిమ్జ్‌లో తయారీ ప్లాంట్ నెలకోల్పేందుకు ఆసక్తి కనబరిచిందని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ట్రైటాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ పెట్టుబడి విలువ రూ.2100 కోట్లు ఉంటుందని.. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ట్రైటాన్ కంపెనీ తొలి ఐదేళ్లలో 50వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేసేలా ప్రాణాళిలు చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రాకతో దేశంలోనే తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందన్నారు. తమ యూనిట్ కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు ట్రైటాన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ మరోసారి ధన్యావాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed