TRS శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్..

by Shyam |
TRS శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఇన్‌చార్జి నేతలతో మంత్రి కేటీఆర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యూయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలని, పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయించాలని సూచించారు.

రాష్ట్రంలోని ప్రతికుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందాయని.. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్షాలే దివాలా తీశాయన్నారు. అంతేకాకుండా, టీఆర్ఎ‌స్‌ను ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలకు ఎజెండా కూడా దొరకడం లేదని కేటీఆర్ వివర్శించారు.

Advertisement

Next Story

Most Viewed