- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు మరోసారి చక్కర్లు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో రాజధాని ప్రాంత వాసులకు సుపరిచితమైన డబుల్ డెక్కర్ బస్సులు అందరినీ విశేషంగా ఆకట్టుకునేవి. ప్రస్తుతం అవి మనుగడలో లేవు. అయితే, ఓ ఔత్సాహికుడి కుతూహలంతో మరల డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
వివరాల్లోకివెళితే.. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొస్తారా అని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు డబుల్ డెక్కర్లో వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కోరారు. ఆ బస్సులను రోడ్లపైకి మళ్లీ తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై టీఎస్ ఆర్టీసీ ఎండీతో చర్చిస్తానంటూ మంత్రి అజయ్ తిరిగి రిప్లే ఇచ్చారు. అంతా సవ్యంగా జరిగితే నగర వాసులు త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను సిటీ రోడ్లపై వీక్షించనున్నారు.