గల్లీ పార్టీ ఏలాలా.? ఢిల్లీ పార్టీ ఏలాలా.? :కేటీఆర్

by Anukaran |   ( Updated:2020-11-19 01:49:14.0  )
గల్లీ పార్టీ ఏలాలా.? ఢిల్లీ పార్టీ ఏలాలా.? :కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రధాని మోదీ ఈ మధ్య వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు.. తాము కూడా అదే అంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. తమది గల్లీ పార్టీ, వారిది ఢీల్లీ పార్టీ.. హైదరాబాద్ ను ఏ పార్టీ ఏలాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించలేదనడం అబద్ధమన్నారు. కేసీఆర్ స్పందించకుండానే రూ.600 కోట్లు విడుదలయ్యాయా అని ప్రశ్నించారు. వరద సాయం కింద కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ఆరేళ్లలో తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి ఇచ్చిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే 150 సీట్లలో పోటి చేస్తామని.. తమకు ఎంఐఎంతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మేయర్ పీఠంపై టీఆర్ఎస్ కు చెందిన మహిళ కూర్చోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పదవి ఎంఐఎంకి ఇస్తారనేది పిచ్చి ప్రచారమన్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 చోట్ల గెలిచాము.. ఈ సారి 10 స్థానాలు గెలుస్తామని అన్నారు. బల్దియాపై గులాబి జెండా ఎగురడం ఖాయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed