పక్కా ప్రణాళికతో ప్రక్షాళన చేపడతాం

by Shyam |
పక్కా ప్రణాళికతో ప్రక్షాళన చేపడతాం
X

దిశ, ముషీరాబాద్: భవిష్యత్తులో వరద నీటి సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ప్రక్షాళన చేపడతామని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికోసం ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గురువారం అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ముంపుకు గురైన ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో వరద నీరు త్వరగా పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. బాధితులకు వెంటనే సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించడంతో పాటు, మందులు పంపిణీ చేయాలని సూచించారు.

అనంతరం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విశ్వజిత్ తదితర అధికారులతో కలసి మంత్రి కేటీఆర్ రాంనగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ శ్వేతా మహంతికి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. ఈ పర్యటనల్లో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story