- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉపయోగకరం: కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల్లో ఉన్న టాలెంట్‌ను తొందరగా గుర్తించేందుకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ యంగ్ మైండ్స్ ఫ్రమ్ తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్ ’ ఇన్నోవేషన్ గ్రాండ్ ఫైనల్ -2020 ఛాలెంజ్ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ ఐటీ శాఖను అభినందించారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచే పరిష్కార మార్గాలుగా తమ ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు సమాజంపై ప్రభావం చూపేలా ప్రదర్శనలు నిర్వహించారని అభినందించారు. యూనిసెఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ (టీఎస్ఐసీ), ఐటీ , విద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 4,041 పాఠశాలల నుంచి 7,093 బృందాల్లో 8,750 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలు నిర్వహించారు. 25 ప్రదర్శనలను గ్రాండ్ ఫైనల్ విన్నర్ కోసం ఎంపిక చేశారు. జ్యూరీ సభ్యులు నిర్ణయం మేరకు విజేతకు అవార్డు, మెంటర్ షిప్ ప్రైజ్‌లను ఇవ్వనున్నట్టు నిర్వహాకులు తెలిపారు.