- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేయూతను కొనసాగిస్తాం : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఐటీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు మంత్రి అవార్డులు అందజేశారు. శుక్రవారం 13 జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో అవార్డుల ప్రదానం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, చేనేత కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 వేల మంది చేనేత రంగంపై ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత మూడేళ్లుగా పెద్ద మొత్తంగా చేనేతకు బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. ఈ రంగంలోని ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి గుర్తు చేశారు. నేతన్నలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు కూడా ఇస్తున్నామన్నారు. నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా 4నెలలు ముందుగానే రూ. 96.43 కోట్లు అందించామని తెలిపారు.
చేనేత మిత్ర ద్వారా నూలు, రసాయనాలపై 50 శాతం రాయితీని అందిస్తున్నామని చెప్పారు. 20,554 మంది నేతన్నలు చేనేత మిత్రలో పేరు నమోదు చేసుకున్నారని వివరించారు. రాయితీల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. 2017 మార్చి 31 వరకు ఉన్న నేతన్నల రుణాలను రద్దు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఎనిమిది బ్లాక్ లెవల్ క్లస్టర్లు అమలు చేస్తున్నామని తెలిపారు.
కొత్త బ్లాక్ లెవల్ క్లస్టర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతి సోమవారాన్ని చేనేత దినంగా పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. దానిని పాటిస్తున్న అధికారులు, నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నేతన్నల కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం చేసుకున్నామని, రసాయనాల వినియోగం తగ్గింపుపై ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతో కూడా ఒప్పందాలు జరిగాయన్నారు. మహిళా చేనేత కార్మికులకు చేయూతనందించడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.
చేనేత లోగో కోసం పోటీ..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్.. చేనేత లోగో పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోటీలో నెగ్గిన వారికి చేనేత, టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అవార్డు ప్రదానం చేస్తామన్నారు. ఈ పోటీలో పాల్గొన దలిచిన వారు http://handloomday.com వెబ్‌సైట్‌ను సందర్శించాలి.