రూ. 300 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక

by Anukaran |   ( Updated:2020-09-21 04:39:12.0  )
రూ. 300 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రెండు వారాల పాటు జీహెచ్‌ఎంసీ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం, పురపాలక పట్టణాల్లో ఉన్న పరిస్థితుల పై చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కేవలం 10 రోజుల్లోనే 54 సెంటి మీటర్ల వర్షం పాతం నమోదైందని గుర్తు చేసిన కేటీఆర్.. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే, ఓపెన్ నాలాల పై క్యాపింగ్ నిర్మాణానికి రూ. 300 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే 2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాల పై కూడా క్యాపింగ్ నిర్మాణం చేపడుతామన్నారు. అంతేకాకుండా.. 2 మీటర్ల కన్నా పొడవైన నాలాల పై గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed