త్వరలో కేశవాపురం ప్రాజెక్టుకు శంకుస్థాపన

by Shyam |
త్వరలో కేశవాపురం ప్రాజెక్టుకు శంకుస్థాపన
X

దిశ, వెబ్‎డెస్క్: కేశవాపురం ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‎లోని ప్రగతి భవన్‎లో జలమండలిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేశవాపురం రిజర్వాయర్‎కు అవసరమైన భూసేకరణ పూర్తి అయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఉండదన్నారు. త్వరలో కేశవాపురం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Next Story