అరకు ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి

by srinivas |
అరకు ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖజిల్లా అరకు ఘాట్‌రోడ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుని, 8మంది అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉండగా, బాధితులంతా హైదరాబాద్‌ వాసులుగా స్థానిక అధికారులు గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అంతేగాకుండా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed