- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామన్ రావు దంపతుల్ని మేం ఎందుకు హత్య చేయిస్తాం: మంత్రి కేటీఆర్
దిశ,వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి’ల హత్య వెనుక టీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టి పారేశారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ న్యాయవాద దంపతుల్ని టీఆర్ఎస్ పెద్దలే హత్య చేయించారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, న్యాయవాదుల మీద మాకేం పగ ఉంటుందని ప్రశ్నించారు. కొంతమంది దుర్మార్గులు నడిరోడ్డుపైన ఇద్దరిని చంపినప్పుడు అంతా బాధపడ్డామని, అదే సమయంలో హత్యకు సంబంధం ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతల్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం కేసీఆర్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవాద దంపతుల హత్య లో టీఆర్ఎస్ కు చెందిన ప్రముఖ నేతలున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండబూతులు తిడతారు. కాంగ్రెస్ నేతలు బూతులు తిడతారు. కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. అలాంటి ప్రతిపక్ష పార్టీల నేతల్నే క్షమించేస్తున్నాం. అలాంటిది న్యాయవాదుల్ని మేం ఎందుకు హత్య చేయిస్తాం. వారితో మాకేం పనని కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా తాగునీటి ప్రాజెక్ట్‌ల్ని ఆపేందుకు కాంగ్రెస్ ఎన్నో కేసులు లేసింది. ఇతర పార్టీలు కేసులు వేశాయి. ప్రాజెక్ట్ లు పూర్తయితే కేసీఆర్ కు మంచి పేరొస్తుందని, అలా పేరు రాకూడదనే ఉద్దేశంతో కేసులు వేశారా? లేదా? అని ప్రశ్నించారు. అలా ఎవరికీ జరగని నష్టం ఒకరికి జరిగితే దాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఆపాదించి, ప్రభుత్వం చేసిన తప్పుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య లో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
‘అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్’ కావాలని న్యాయవాదులు అడుగుతున్నారని, ఆ విషయాన్ని త్వరలోనే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.