సహాయం కోసం ట్వీట్.. స్పందించిన మంత్రి కేటీఆర్

by Shyam |
సహాయం కోసం ట్వీట్.. స్పందించిన మంత్రి కేటీఆర్
X

దిశ, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిన వారి సమస్యలను మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలానికి చెందిన పండిట్ జావీద్ ట్విట్టర్ ద్వారా తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. పని కోసం హైదరాబాద్ సమీపంలోని కొత్తూరుకు వెళ్లిన తన బావ, అక్కపిల్లలు భోజనానికి అవస్థలు పడుతున్నారని వివరించాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ శంషాబాద్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు ఫోన్ చేసి వారికి భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో చైర్మన్, కమిషనర్‌ బాధితులకు నిత్యావసరాలు, నగదు అందించారు.

Tags: corona, lockdown, twitter, minister ktr, response, provide food

Advertisement

Next Story