- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక తూర్పు దిక్కుకు ఐటీ
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరం నలుమూలలా అభివృద్ది చెందెలా ప్రభుతం ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఉప్పల్ ఎన్ఎస్ఎల్ఐటీ సెట్‌లో హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలను నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో భవిష్యత్తులో ఐటీ కంపెనీల ఏర్పాటు, మార్గదర్శకాలపై చర్చించారు. త్వరలోనే ఐటీ కంపెనీలు అన్నివైపులా విస్తరించే గ్రిడ్ పాలసీతో ప్రభుత్వం ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్‌కి తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనపైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను 5 కంపెనీల ప్రతినిధులకు మంత్రి అందజేశారు. ఈ కంపెనీలు సుమారు 25లక్షల చ.అడుగుల ఐటీ పార్కులను, ఆఫీస్‌లకు అవసరమైన స్పేస్‌ని డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. దానివల్ల ఉప్పల్ ప్రాంతంలో 30వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నారు.
హైదరాబాద్ నలువైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రిడ్ విధానంతో ఐటీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళతాయన్న నమ్మకం ఉందన్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న మెట్రో, శిల్పారామం, మూసి నది సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతులు పెరుగుతున్నాయని తెలిపారు. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వైపు, అంబర్‌పేట, రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్డు మౌలిక వసతులు పెరుగుతాయన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళితే వారి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సమాచార సంచికను మంత్రి ఈ సందర్భంగా అవిష్కరించారు. సమావేశంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ పాల్గొన్నారు.