మళ్లీ లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు : కేటీఆర్

by Anukaran |
మళ్లీ లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో త్వర‌లోనే ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం ట్విట్టర్ వేదిక‌గా ప్రజలతో కేటీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు విషయాలు యువతతో పంచుకున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలు ఇచ్చారు. దేశంలో వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అని, అందుకోసం ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మాస్కు ధరించాలన్నారు.

మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణం కొనసాగుతుందన్నారు. టీమిండియాలో రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్స్ అని తెలిపారు. కరోనాపై ప్రజలను చైతన్యం చేసే ఒక పాటను తయారు చేస్తానన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి అభినందనలు తెలిపారు. అంతేగాకుండా.. దేశంలోనే ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక మద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అన్నారు. తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ మీద‌ హామీ ఇచ్చిన వ్యక్తిని అడగాలన్నారు. వ్యక్తిగతంగా తన కూతురికి కొడుకుకి మనసు మాట వినాలని చెప్తా అని, ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వన‌ని తెలిపారు.

Advertisement

Next Story