- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో కొత్తగా స్వచ్ఛ ఆటోలు
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని గృహాల నుంచి చెత్త సేకరణ కోసం 350 స్వచ్ఛ ఆటోలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పౌర సౌకర్యాలను మెరుగుపరిచేందుకు స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా జీహెచ్ఎంసీలో అదనంగా 650 స్వచ్ఛ ఆటోలను 1.5 టన్నుల సామర్థ్యంతో అందించినట్లు తెలిపారు. అంతకుముందున్న ఆటోల సామర్థ్యం 850 కిలోలు మాత్రమే కాగా, ఈ సారి పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. చెత్త సేకరణలో సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, ఆరోగ్యకరమైన హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దడానికి పారిశుధ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి సూచించారు. అనంతరం మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ డ్రైవర్ కం ఓనర్ పథకం కింద పేద ప్రజలకు కేటాయించిన ఈ స్వచ్ఛ ఆటోలు అన్ని సర్కిళ్లకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్ విజయా రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు ప్రవీణ్య, రవి కిరణ్, అశోక్ సామ్రాట్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.