- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 వేల లీటర్ల తాగునీరు ఉచితం : మంత్రి కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ వాసులకు తెలంగాణ సర్కార్ అందిస్తున్న న్యూ ఇయర్ కానుకను రాష్ట్ర మంత్రి కేటీ.రామారావు ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరంలోని రెహమత్‌నగర్‌లో ఉచిత తాగు నీరు పథకాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం రెహమత్ నగర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లులను పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రతీ కుటుంబానికీ నెలకు 20 వేల లీటర్ల తాగునీరు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. 20 వేల కన్నా అదనంగా నీరు వాడుకుంటే చార్జీలు విధించడం జరుగుతుందని వెల్లడించారు. అంతేగాకుండా ఉచిత తాగునీటిని పొందేందుకు మీటర్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మీటర్ రీడింగ్ ప్రకారం 20 వేల లీటర్లు టారీఫ్ ప్రకారం బిల్లు వసూలు చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. బస్తీలతో పాటు అపార్ట్‌మెంట్ వాసులకూ ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు సూచించారు. అంతేగాకుండా ఒక్కో ప్లాటుకు 20 వేల లీటర్ల చొప్పున తాగునీరు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయని తెలిపారు. ఇంకా మీటర్లు లేని వారు తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.