- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపాలిటీల్లో యుద్దప్రాతిపదికన శానిటేషన్ చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాఖ అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టి చెత్తను తొలగించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను శనివారం రాష్ట్ర పురపాలక శాక విడుదల చేసింది. ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు ఫోన్‌లో వివరించారు. ఉద్యోగులు విధిగా విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రి కేటీఆర్ కోరారు.
మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్కెట్లు, బస్ స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించకూడదని పేర్కొన్నారు. బిన్ ఫ్రీ సిటీగా చేపట్టిన చర్యల వల్ల ఇంటింటి నుంచి గార్బేజ్ సేకరణ మరింత పెరగాలన్నారు. శానిటేషన్ సిబ్బందికి హ్యాండ్ గ్లౌజ్‌లు , శానిటైజర్, మాస్కులను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.
జీహెచ్ఎంసీకి ప్రత్యేక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సర్కిల్‌లో ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయిలో గార్బేజ్ ను తొలగించేలా చర్యలు చేపట్టాలని అందులో సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఓపెన్ డస్ట్ బిన్‌లను తొలగించిన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు నిత్యం పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
- Tags
- ktr
- Sanitization