‘జీహెచ్‌ఎంసీలో మహిళలకు 50 శాతం సీట్లు’

by Anukaran |   ( Updated:2020-10-13 01:01:33.0  )
‘జీహెచ్‌ఎంసీలో మహిళలకు 50 శాతం సీట్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లులు మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టారు. అందులో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించేలా చట్ట సవరణ చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో 79 జీహెచ్‌ఎంసీ సీట్లలో మహిళలను గెలిపించుకున్నామని వెల్లడించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.

ఈ సందర్భంగా బడ్జెట్‌లో హరితహారానికి పదిశాతం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా పెట్టిన ప్రతి మొక్కా బతకాలని, వాటి బాధ్యత కార్పొరేటర్లదే అని సూచించారు. అంతేగాకుండా ఇండియన్ స్టాంప్ యాక్ట్‌కు సవరణలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కొన్ని సవరణలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed