థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : KTR

by Shyam |
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్ థర్డ్ వేవ్‌పై పోరాడటానికి సన్నద్ధతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని నిర్మించిందన్నారు. కోవిడ్-19కి సంబంధించిన మొత్తం డేటాను సమగ్రపర్చడం, నిర్వహించడం ద్వారా కంట్రోల్ రూం పూర్తి నియంత్రణను సాధించగలమన్నారు. పౌరుల భయాలను పోగొట్టడం, సలహాలు, సూచనలు అందజేస్తుందని తెలిపారు.

అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. పౌరులు 1905 కు డయల్ చేయవచ్చని, పరీక్ష, టీకా కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, ఆసుపత్రిలో చేరడం వంటి అన్ని కోవిడ్ సంబంధిత సేవల గురించి సమాచారం పొందవచ్చని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లను, కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రాహుల్ బోజ్జా, ఐఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ డైరెక్టర్ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story