దయచేసి ఈ అజ్ఞానికి ఎవరైనా చెప్పండయ్యా : కేటీఆర్

by Shyam |
దయచేసి ఈ అజ్ఞానికి ఎవరైనా చెప్పండయ్యా : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి కేంద్రం పన్నుల రూపంలో ఎంత మొత్తంలో తీసుకుంటోంది.. ఎంత వెనక్కి ఇస్తుందనే విషయంపై మంత్రి కేటీఆర్ బండి సంజయ్‌కు వివరించే ప్రయత్నించే ప్రయత్నం చేశారు.

‘‘దయచేసి ఈ అజ్ఞానికి ఎవరైనా అవగాహన కల్పించండి’’ అంటూనే, తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.2,72,926 కోట్లను కేంద్రం తీసుకుంటోందని తెలిపారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది రూ.1,14,329కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ సమాచారాన్ని బట్టి ఎవరు ఎవరికీ సహకరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. దేశం అభివృద్ధికి తెలంగాణ దోహదపడుతోందని సంతోషిస్తున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed