- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగర వాసులకు దీపావళి కానుకలు : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జీహెచ్ఎంసీ వర్కర్ల జీతాన్ని రూ. 14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నామన్నారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌లో ప్రభుత్వ పరంగా సాయం చేశామని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మెరుగుపడుతోందన్నారు. ప్రజలకు ఇంకా ఏదైనా మేలు చేయాలని మంత్రులు కోరారు.అందులో భాగంగానే నగరవాసులకు దీపావళి కానుక అందించబోతున్నామని కేటీఆర్ చెప్పారు.
2020-21లో ఆస్తి పన్నులో రాయితీ ప్రకటిస్తామన్నారు.జీహెచ్ఎంసీలో 15వేల వరకు ఆస్తిపన్ను కట్టేవారికి 50శాతం రాయితీ ఇస్తామని..ఇతర పట్టణాల్లో రూ.10వేల పన్ను కట్టేవారికి 50శాతం రాయితీలు ఇస్తామన్నారు. ఇప్పటికే పన్ను కట్టినవారికి వచ్చే ఏడాది రాయితీ ఉంటుందన్నారు.ఈ ఏడాది వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడిందని, నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు పాడయ్యాయని వివరించారు. దసరా ముందురోజు లక్ష కుటుంబాలకు సాయమందించామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సాయం అందని వరద బాధితులకు మరోసారి అవకాశం ఇస్తామని, వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.వాటిని అధికారులు పరిశీలించాక బ్యాంకు అకౌంట్ కు డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. పండుగ వేళ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో సీఎం కీసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.