ట్యాంక్‌బండ్‌ ప్రేమికులకు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్

by Anukaran |   ( Updated:2021-08-24 03:04:25.0  )
tankbund as no traffic zone
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఇకపైన ప్రతీ ఆదివారం సాయంత్రం మూడు గంటల పాటు వాహనాల రొద బాధ తప్పనుంది. ట్యాంక్ బండ్ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి అక్కడకు వచ్చే ప్రజలకు మంత్రి కేటీఆర్ బిగ్ రిలీఫ్ కల్పించారు. ఎంచక్కా వాహనాలు లేకుండా కేవలం నగర ప్రజలు ప్రశాంతంగా, ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడకుండా నో ట్రాఫిక్ జోన్‌గా మారనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా నగర పోలీసు కమిషనర్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ వారం నుంచే అది సాకారం కానుంది. ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని మంత్రి కేటీఆర్‌ పోలీసు కమిషనర్‌కు సూచించారు. హైదరాబాద్ వాసుల ట్విట్టర్‌ విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు తేవాలని, నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సీపీకి సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని తెలిపారు. ట్యాంక్‌బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed