సీజనల్ వ్యాధుల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి

by sudharani |
సీజనల్ వ్యాధుల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ‘ పది గంటలకు – పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రగతి భవన్‌ పరిసరాల్లో నిల్వ నీటిని తొలగించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీజనల్ వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు. వర్షాకాల సీజన్‌తో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయించాలని తద్వారా ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed