- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.లక్ష: మంత్రి కొప్పుల ఈశ్వర్
దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగులను పెళ్లి చేసుకున్నోళ్లకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని కంటికి రెప్పలా చూసుకుంటుందన్నారు. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.1500లకు , ఆ తర్వాత క్రమంగా రూ.3,016కు పెంచామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా 18 వందల కోట్లను ఖర్చు పెట్టి 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. అంతేగాక ఉద్యోగాలలో 2%రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లను 3% నుంచి 5% పెంచామన్నారు .ఇక డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5% దివ్యాంగులకు కేటాయిస్తున్నామన్నారు. అంధత్వం ఉన్న వాళ్లకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ల్యాప్‌టాప్స్ ఇస్తున్నామన్నారు. ఇటీవల 21కోట్లతో 14వేల మంది దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలను అందజేశామన్నారు. రూ.90వేల విలువ చేసే టూవీలర్లను కూడా ఇచ్చామన్నారు.