అనీస్-ఉల్ గుర్బాను సందర్శించిన మంత్రి కొప్పుల

by Shyam |
అనీస్-ఉల్ గుర్బాను సందర్శించిన మంత్రి కొప్పుల
X

దిశ, హైదరాబాద్

హైదరాబాద్ నాంపల్లి లోని అనాధ పిల్లలకు ఆశా కిరణం అనీస్-ఉల్ గుర్బా ను బుధవారం సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఆశ్రమం 1921లో స్థాపించారని, ఇందులో 6 ఏండ్ల నుంచి 16 సంవత్సరాల లోపు అనాధలను చేర్చుకుని వసతి కల్పిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత అనీస్ సేవలు విస్తరించే లక్ష్యం తో సీఎం కేసీఆర్ 21 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఆశ్రమం నిర్వహణ వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంటుందని వివరించారు. ఈ అనీస్ లో అనాధ బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, వసతి అందిస్తున్నట్టు తెలిపారు. అనీస్-ఉల్ గుర్బా భవనం పూర్తి నిర్మాణానికి అయ్యే నిధులు తర్వాత మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

tags; minister koppula eshwar, visit anis ul ghurba orphanage ashram

Advertisement

Next Story

Most Viewed