- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత :కొడాలి
దిశ, వెబ్డెస్క్: ఏపీఅసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? ఏమైంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ..టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
టీడీపీ హయాంలో మీరు ఎంతిచ్చారో మాకు తెలుసు అని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో పెన్షన్‌లో రూపాయి పెంచలేదన్నారు. వైఎస్సార్ భరోసా పథకం కింద అర్హులకు పెన్షన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుందన్నారు. పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తికి తమ నాయకుడిని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
పారిపోయే వారు ఎవరో ప్రజలకు తెలుసు.. నాడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ వదిలి పారిపోయారు. కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారిపోయారరని విమర్శించారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నాయకుడు అంటూ వ్యాఖ్యానించారు.