నిమ్మగడ్డ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం : కొడాలి నాని

by srinivas |
నిమ్మగడ్డ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం : కొడాలి నాని
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో ఉండబోదని మరో మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపై హడావుడి చేయడం మానుకోవాలని మంత్రి సూచించారు. ఆయన ఇంకా కొన్నినెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారని, తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారని వెల్లడించారు. ప్రభుత్వానికి రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని తప్పకుండా సంప్రదించాలని, లేనియెడల అది సాధ్యమయ్యే పని కాదన్నారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే యోచనలో లేదని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. బీహార్ ఎన్నికలతో, స్తానిక సంస్థల ఎన్నికలతో పోల్చకూడదని వివరించారు. ఇదే అంశంపై నిన్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేయగా.. స్థానిక ఎన్నికల నిర్వహణపై SEC రమేష్ కుమార్ అన్ని పార్టీల నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు.

Advertisement

Next Story

Most Viewed