చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు !

by srinivas |
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రైతులకు రూ.77వేలు ఇచ్చేవారని అంటున్నారని, మరి అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పిన మేము.. అధికారంలోకి వచ్చాక రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. వారంరోజులు నీటిలో ఉంటేగాని వరద నష్టపరిహారం ఇవ్వకూడదని గతంలో చంద్రబాబు జీవో ఇచ్చారని పేర్కొన్నారు. అక్టోబర్‌లో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నా మంత్రి.. నవంబర్ మొదటి వారంలో నష్టపరిహారం చెల్తిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story