ఆర్థిక స్వావలంబన దిశగా కార్యాచరణ: కన్నబాబు

by srinivas |
ఆర్థిక స్వావలంబన దిశగా కార్యాచరణ: కన్నబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ మార్కెటింగ్, రైతు బజార్లపై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. రైతు బజార్లలో మౌళిక సదుపాయాలు, అభివృద్దికి అవసరమైన నిధులపై సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. రైతు బజార్లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని మంత్రి సూచించారు. ఆదాయ వనరులను పెంచే అవకాశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతులకు నాణ్యమైన సేవలను, మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story