- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యాపేటకు తిరిగిరానున్న కల్నల్ సంతోష్ బాబు
దిశ ప్రతినిధి, నల్లగొండ : భారత్- చైనా బోర్డర్‌లో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు మరో రెండు మూడు రోజుల్లో తిరిగి సూర్యాపేటకు రానున్నారు. అదేంటి.. చనిపోయిన సంతోష్ బాబు తిరిగి రావడమేంటి..? అనుకుంటున్నారా.. మరేం లేదండీ.. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు సేవలు ప్రతిఒక్కరిలో స్ఫూర్తిని రగిలించేలా ఆయన విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
అందులో భాగంగానే ఈనెల 15న సూర్యాపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణకు, సూర్యాపేట గడ్డకు గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చిన సంతోష్ బాబు విగ్రహాన్ని పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కొండంత భరోసాను, ధైర్యాన్ని అందించారని, వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాను కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు.