ఆరోగ్య తెలంగాణే సర్కార్ లక్ష్యం

by Shyam |
ఆరోగ్య తెలంగాణే సర్కార్ లక్ష్యం
X

దిశ, నల్లగొండ: ఫ్లోరోసిస్ నీళ్లు తాగడంతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వందలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారరని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇందుకు గత పాలకులే కారణమన్నారు. జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలేరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story