సోయాబీన్‌కే డిమాండ్: మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
సోయాబీన్‌కే డిమాండ్: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు మొదటగా జిల్లా స్థాయిల్లో ఆ తరువాత నియోజకవర్గ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నమంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా గ్రామాల్లోని రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నంద్యాలవారిగూడెంలో మంగళవారం మధ్యాహ్నం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రంది లేదని, సోయాబీన్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. ఫామాయిల్ పంట వైపు రైతులు దృష్టిసారిస్తే అందుకు అనుగుణంగా ఆయిల్ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు. రైతులను సంఘటితం చేసేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో నీరు విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు నియంత్రిత సాగులో భాగస్వామ్యం అవుతామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed