బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఫిర్యాదు

by Anukaran |   ( Updated:2020-11-20 05:26:18.0  )
Minister Jagadish Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ను ఉగ్రవాది అన్న బండి సంజయ్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌కు సంజయ్‌పై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్షాల మాటలు దురదృష్టకరమన్నారు. సీఎంను దేశ ద్రోహీ అని దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. ఆఖరికి వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే వరద సాయం నిలిపివేసేలా రెండు పార్టీలు కలిసి ఎస్‌ఈసీకి లేఖ రాశాయని ఆయన ఆరోపణలు చేశారు. ఒకవేళ నిజంగానే బండి సంజయ్ సంతకం ఫోర్జరీ చేస్తే పోలీస్ స్టేషన్‌ వెళ్లాలి కానీ, గుడి కాదని చెప్పారు.

మేయర్ పీఠం మాదే:
గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో 150 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని గుర్తు చేసిన జగదీశ్ రెడ్డి తమకు ఎవరితో పొత్తు లేదని.. తెలంగాణ ప్రజలతోనే పొత్తు ఉందన్నారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలది చీకటి ఒప్పందం అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తోందని మంత్రి ఆరోపణలు చేశారు. గతంలో నిజామాబాద్, కరీంనగర్, దుబ్బాకలో కూడా సహకరించుకున్నారన్నారు. ఏది ఏమైనా ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పిన జగదీశ్ రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. వందకు పైగా డివిజన్‌లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. దుబ్బాకలో అప్రమత్తంగా లేకనే ఓడిపోయామని మంత్రి జగదీశ్ రెడ్డి ఓటమికి అంగీకారం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed