- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాడు దండగ.. నేడు పండగలా
దిశ, నల్లగొండ: తెలంగాణ భూముల్లో బంగారం పండుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను పండే సామర్థ్యం ఇక్కడి భూములకు ఉందన్నారు. అటువంటి భూముల్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చెయ్యగలిగినప్పుడే రైతుకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళాలో ఆయన లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం మీద విశ్వాసం పెరిగిందన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ చేయూతతో పండుగగా జరుపుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రైతాంగాన్ని నియంత్రిత సాగు వైపు మళ్లించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.