- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంతోష్‌బాబు ఫ్యామిలీకి మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సంతోష్‌బాబు ఫ్యామిలీకి రూ.5కోట్ల నగదు, ఇంటి జాగతో పాటు, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వ అందించే సాయాన్ని వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలిసి చెప్పామని, వారు ఒప్పుకున్నారని మంత్రి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు చేరుకొని సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5కోట్ల నగదు చెక్కు, ఇంటి స్థలం పట్టా అందిస్తారని మంత్రి వెల్లడించారు.
Advertisement
Next Story