కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-08-20 06:06:59.0  )
కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర మోసపూరితమైనదని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు స్విస్‌ బ్యాంక్‌‌లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని చెప్పిన బీజేపీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్ద ఉన్న తెల్ల డబ్బును సైతం వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నోట్ల రద్దు ఎందుకు చేశారని అడిగిన ప్రశ్నకు నల్ల డబ్బు అంశం తెరపైకి తీసుకొచ్చారన్నారు. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఇది ఇలా ఉంటే కేంద్రం తెలంగాణకు డబ్బులు ఇస్తోందని కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలను నిరూపించాలని జగదీష్ రెడ్డి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ. 2 వేల పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఎక్కడ ఉందో చూపించాలని.. కనీసం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు.

Advertisement

Next Story