స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

by Aamani |   ( Updated:2021-08-18 04:45:06.0  )
స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ‌లోని ప్రాజెక్ట్, చెరువులు, కుంట‌లు నిండుకుండ‌లా మార‌యని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్ మండ‌లంలోని స్వ‌ర్ణ జ‌లాశ‌యాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. న‌దీమాత‌ల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎగువ‌న కురుస్తున్న వానల వ‌ల్ల స్వ‌ర్ణ ప్రాజెక్ట్ లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంద‌ని అధికారులు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. గ‌త నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల ఊహించ‌ని రీతిలో స్వ‌ర్ణ ప్రాజెక్ట్ లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో గేట్లు తెర‌వాల్సి వ‌చ్చింద‌ని దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మై తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని, భవిష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్రాజెక్ట్ గేట్లు తెరిచే స‌మయంలో పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed