ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా చర్యలు

by Aamani |
ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా చర్యలు
X

దిశ, ఆదిలాబాద్: ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్మల్ జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో మంత్రి అన్ని జిల్లాల అట‌వీశాఖ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లు, జిల్లా అటవీ అధికారులు, ఫారెస్ట్ రేంజర్‌లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చేందుకు 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. అలాగే కోటి చింత మొక్క‌లు నాటి భ‌విష్య‌త్తులో తెలంగాణ‌కు చింత‌పండు దిగుమ‌తి అవ‌స‌రం లేకుండా చూడాలన్నారు. తునికాకు సేక‌ర‌ణ పురోగ‌తిపై కూడా మంత్రి ఆరా తీశారు. కార్య‌క్ర‌మంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed