ఛత్రపతి శివాజీకి మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి నివాళి

by Aamani |
ఛత్రపతి శివాజీకి  మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి నివాళి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మరాఠా సామ్రాజ్య యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా.. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టణంలోని శివాజీ చౌక్ వ‌ద్ద శివాజీ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. శివాజీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించి, ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచార‌న్నారు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డార‌ని పేర్కొన్నారు.

Next Story

Most Viewed