అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

by Aamani |   ( Updated:2021-08-19 03:38:50.0  )
అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, నిర్మల్ రూరల్: అన్ని రంగాలలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో రూ . 10 లక్షల నిధులతో నిర్మించిన శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని 10 లక్షల నిధులతో నిర్మించామని, ప్రహరీ గోడకు మరో 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సొన్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘ భవనం‌తో పాటు గ్రామపంచాయతీ సమీకృత భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు నూతన ఆలయాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని గత ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకోకపోవడం వలనే ఇలా శిథిలావస్థకు చేరాయన్నారు. అలాగే అన్ని కులాల మతాల వారికి రాష్ట్ర ప్రభుత్వం సంఘ భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. 50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేయటం జరుగుతుందని, ఇవే కాకుండా ఆసరా పెన్షన్‌లకు 65 ఉన్న వయస్సు నుండి 57 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సొన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యం రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సుభాష్ రావు, కృష్ణ ప్రసాద్ రెడ్డి , వైస్ ఎంపీపీ లలిత విలాస్, సర్పంచ్ అనిల్, ఎక్స్ సర్పంచ్ పద్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed